calender_icon.png 26 October, 2024 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్, మలేషియా బంధం బలోపేతం

29-07-2024 02:32:18 AM

టీక్షూవాకన్సల్ట్ మలేషియా ద్వారా సాధ్యం

డబ్ల్యూటీఐటీసీ చైర్మన్ సందీప్‌తో మలేషియా మంత్రి గణబతిరావు వెరమన్ భేటీ

హైదరాబాద్, జూలై 28 (విజయ క్రాంతి): టీక్షూ మలేషియా శాఖ ద్వారా భారత్, మలేషియా దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం బలోపేతం సాధ్యమవుతుందని మలేషియా మంత్రి గణబతిరావు వెరమన్ ఆకాంక్షించారు. వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్యూటీఐటీసీ) చైర్మన్ సందీప్ మఖ్తాలను గణబతిరావు వెరమన్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీనకన్సల్ట్ మలేషియా శాఖను ప్రారంభించిమాట్లాడారు.

టీటీకన్సల్ట్ చేస్తున్న కృషిని, చూపుతున్న చొరవను అభినందించారు. భారతీయుల ఆవిష్కరణలకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సందీప్ మఖ్తాల మాట్లాడుతూ.. మలేషియాలోని పలు రంగాల్లో పురుగతి, అభివృద్ధి సాధించే దిశగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు టీ మలేషియా ఎంతో దోహదపడుతుందని చెప్పారు. యువతలో నైపుణ్యాభివృద్ధే తమ లక్ష్యమని, టీ ద్వారా మలేషియాలోని యువతకు ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని అధిగమించే విధంగా అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని స్పష్టంచేశారు. మలేషియా మంత్రి గణబతిరావు వెరమన్ తెలంగాణ మూలాలున్న వ్యక్తి కావడం పట్ల సందీప్ మఖ్తాల సంతోషం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో డబ్యూటీఐటీసీ సభ్యులు మారుతీ కుర్మ, శ్రీకాంత్ జులూరి, యుగరాజ పలనిసామి, నాగేంద్రరావు, సతీరావు, భువనేశ్వరి, రవితేజ పాల్గొన్నారు.