calender_icon.png 19 January, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2:2:2 రూల్‌తో బంధం బలోపేతం

28-09-2024 12:00:00 AM

మీరు మంచి రిలేషన్ కొనసాగించాలను కుంటున్నారా.. అయితే కచ్చితంగా హనీమూన్‌ను ప్లాన్ చేసుకోండి. దాని వల్ల జంటలు ఏకాంతంగా గడిపే సమయం దొరుకుతుంది. ఒకరి ఇష్టాలను మరొకరు తెలుసుకోవచ్చు. దాంతో ఆనందంగా, హాయిగా ఉండొచ్చు. చాలా జంటలు తమ బంధాన్ని కలకాలం బలంగా ఉండాలని కోరుకుంటున్నాయి.

అలాంటివారి కోసమే 2:2:2 అనే కొత్త రిలేషన్ రూల్ వచ్చింది. దంపతులు అన్యోన్యంగా ఉండేందుకు ఈ రూల్‌ను పాటించాలని చెబుతున్నారు ఢిల్లీకి చెందిన కౌన్సిలర్ రుచి రుహ్. 

2:2:2 అంటే

ప్రతి 2 వారాలకు ఒక డేటింగ్ నైట్ కు వెళ్లడం

ప్రతి 2 నెలలకు ఒక వారాంతపు సెలవు తీసుకోవడం

ప్రతి 2 సంవత్సరాలకు ఒక వారంపాటు వెకేషన్‌కు వెళ్లడం. 

ప్రస్తుత బిజీ షెడ్యూల్ వల్ల దంపతుల మధ్య సఖ్యత తగ్గిపోతోంది. అందుకే ఈ రూల్ ను ఫాలో కావాలని చెబుతున్నారు. భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంపొందించడంలో, బంధం మరింత ధృడంగా ఉండేందుకు ఈ రూల్ బాగా పనిచేస్తుంది. జంటలు దీర్ఘకాలంగా సంతోషంగా ఉండగలుగుతారు.

ఇది వైవాహిక జీవితానికి మరింత మేలు చేస్తోంది. విహారయాత్రలు కమ్యూనికేషన్, సాన్నిహిత్యం లాంటివి భార్యాభర్తల మధ్య దూరాన్ని తగ్గిస్తాయి. బిజిలైఫ్‌కు గుడ్‌బై చెప్పి లాంగ్ వెకేషన్‌కు వెళ్లడం వల్ల దంపతుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధం ఏర్పడి మంచి రిలేషన్ ఏర్పడుతుంది. భాగస్వామి కోసం కచ్చితమైన సమయం కేటాయించడం వల్ల భావోద్వేగపరంగా కనెక్ట్ కావొచ్చు.

అయితే రూల్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఈ నియమం జంటల్లో ఫోమో (మిస్సింగ్ భయం)ను సృష్టిస్తుంది. వెకేషన్ నచ్చినవిధంగా లేకపోతే.. అనవసర ఒత్తిడి పడి దంపతుల మధ్య బంధం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. కొందరు ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడితే.. మరికొందరు ఔటింగ్ వెళ్లడానికి ఇష్టపడుతారు. కాబట్టి ఈ రూల్ పట్ల ఇద్దరికీ సదాభిప్రాయం ఉండాలి.