calender_icon.png 20 September, 2024 | 6:23 AM

వరదగట్లను పటిష్ఠం చేయండి

21-07-2024 12:00:00 AM

నిన్నటివరకు వర్షాభావంతో అల్లాడిన తెలంగాణకు ఇప్పుడు వరదల ప్రమాదం ముంచుకొచ్చింది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో గత నాలుగైదు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఏజన్సీ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలోని అశ్వారావు పేట పెద్ద వాగుకు గండి పడడంతో వందలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. వరద నీరు గ్రామాల్లోకి చొచ్చుకు రావడంతో ప్రజలు ఎత్తయిన ప్రదేశాలు, చెట్లపైన రాత్రంతా  తలదాచుకోవలసి వచ్చిందని వార్తలు వచ్చాయి. గత కొంతకాలంగా చెరువులు, వాగుల గట్ల పటిష్ఠత గురించి పట్టించుకోకపోవడంతో అవి బలహీనమై తెగిపోతున్నాయి. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో వర్షాలు మరింత ఎక్కువ కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి వంటి పెద్ద నదులకు వరద వస్తే పరిస్థితి దారుణంగా ఉండే ప్రమాదం ఉంది. ఆస్తినష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా జరగవచ్చు. కనుక అధికారులు ఇప్పుడే మేల్కొని, అన్ని నదులు, వాగులు, చెరువు గట్లను పటిష్ఠం చేసేందుకు చర్యలు తీసుకోవాలి.

  రాములు నాయక్, మణుగూరు