20-04-2025 04:26:05 PM
పట్టించుకోని గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్యదర్శులు..
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రముతో పాటు మండల పరిధిలోని అన్నారం, కొత్తగూడెం తదితర గ్రామాల్లో గ్రామపంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యముతో రాత్రి వేళలో వెలగవలసిన దీపాలు, పట్టపగలు కూడా వీధిలైట్లు వెలుగుతున్నడం గమనార్హం. ప్రస్తుతం గ్రామాల వీధిలైటు వేయడానికి ప్రత్యేక సిబ్బంది ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహించడంతోనే ఈ విధంగా పట్టపగలు వెలిగి, కరెంటు వృధాగా ఖర్చు అవుతుందని ప్రజలు మేధావులు ఆరోపిస్తున్నారు. తక్షణమే మండల అభివృద్ధి అధికారులు పర్యవేక్షణ చేసి నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.