calender_icon.png 26 March, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చీకటిని పారద్రోలి వెలుగునిచ్చేందుకు వీధిలైట్లను ఏర్పాటు

25-03-2025 08:45:36 PM

మునుగోడు (విజయక్రాంతి): గ్రామాలలో అలముకుంటోన్న చీకట్లను పారద్రోలి వెలుగునిచ్చేందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో వీధి లేట్లను ఏర్పాటు చేయడం సంతోషకరమని కాంగ్రెస్ మండల నాయకులు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని జమస్తాన్ పల్లి గ్రామంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పంపించిన 28 వీధి లైట్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వం ఏనాడు గ్రామాలలో వీధి లేట్లను ఏర్పాటు చేయలేదని, అందుకు నిదులు కేటాయించకపోవడంతో గ్రామాలన్ని అందకారంలో మునిగాయన్నారు. రాత్రి సమయంలో ప్రజలు బయటకు వెళ్లాలంటే ఇబ్బందులకు గురైయ్యే వారన్నారు.

ప్రతి గ్రామానికి ఎమ్మెల్యే వీధి లైట్లు అమర్చడంతో రాత్రి కూడా పట్టపగలు లాగే ఉందన్నారు. మా గ్రామానికి వీధిలైట్లు ఇచ్చిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి గ్రామస్తులు కృతజతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునుగోడు సీనియర్ జర్నలిస్టు జాజుల స్వామి గౌడ్, మాజీ సర్పంచ్ ముంత యాదగిరి, నాయకులు జాజుల శంకర్, అందుగుల భాస్కర్, అందుగుల మారయ్య, తుపాకి పార్వతమ్మ, ముంత గణేష్, పంతంగి వెంకటయ్య, మంగదుడ్ల నర్సింహ్మ, జాజుల రవి, పగిళ్ల లింగస్వామి, శేఖర్, ముంత లక్ష్మయ్య, జాజుల మారయ్య, ముంత లింగస్వామి, పంతంగి యల్లయ్య, ముంత మారేష్, తదితరులు పాల్గోన్నారు.