calender_icon.png 27 November, 2024 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీధి వర్తకులకు రైతు బజార్ లో స్టాళ్లు కేటాయించాలి

05-11-2024 03:02:40 PM

ఫుట్ పాత్ కబ్జాలపై అధికారులు చర్యలు తీసుకోవాలి

ట్రాఫిక్ నియంత్రణపై ఉన్నతాధికారులతో సమీక్ష

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆదేశాలు

నిజామాబాద్ (విజయక్రాంతి): వీధి వ్యాపారులకు రైతు బజార్లో స్టాల్స్ కేటాయించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం నిధిగా మా బాధలో ట్రాఫిక్ నియంత్రణపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫుట్ పాత్ నిర్మాణాలు విచ్చలవిడిగా కబ్జాలు చేయడం వలన ట్రాఫిక్ నియంత్రణ కావడం లేదని తక్షణమే అక్రమ నిర్మాణాలను తొలగించాలని మున్సిపల్ అధికారులను ట్రాఫిక్ ఏసిపి లను కోరారు. నగరంలో పలుచోట్ల చెత్త వ్యర్ధాలు సరిగా తొలగించడం లేదని అన్నారు. మార్కెట్ వంటి పరిసరాల్లో కుప్పలు తెప్పలుగా చెత్త పేరుకుపోయి ఉంటుందని అన్నారు.

డ్రైనేజీ వ్యర్థాలను పూర్తిగా తొలగించని కారణంగా అనారోగ్యాలా బారిన పడుతున్నారని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నగరంలో రోడ్లపై కూరగాయలు తోపుడుబండ్లతో వ్యాపారాలు కొనసాగించడం వలన అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందని అన్నారు. వీధి వ్యాపారాలు చేసుకునే వారికి తక్షణమే రైతు బజార్లో స్టాళ్లను కేటాయించాలని అధికారులకు ఆదేశించారు. నిజామాబాద్ అభివృద్ధికి నాయకులు ప్రజలు అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మున్సిపల్ కమీషనర్ దిలీప్ కుమార్, ట్రాఫిక్ ఏసిపి నారాయణ లతో పాటు ట్రాఫిక్ సిఐ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.