calender_icon.png 25 October, 2024 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్లపల్లి డివిజన్ లో వీధి కుక్కల స్వైర విహారం

25-10-2024 07:04:32 PM

చర్లపల్లి,(విజయక్రాంతి): ఈ మధ్య కాలంలో వీధి కుక్కలు విపరీతంగా చిన్న పిల్లలు, పెద్దవారు అని తేడా లేకుండా అందరిపై  దాడులు చేస్తున్నాయి. చర్లపల్లి ఈసీ నగరానికి చెందిన ధరణి తెలుగు దినపత్రిక ఎడిటర్ జి రోజా రాణిపై వీధి కుక్కలు దాడి చేయడంతో ఆమె గాయపడ్డారు. తను ఇంటి కాంపౌండ్ లో పని చేసుకుంటున్న రోజా రాణిపై ఇంటి లోపలికి చొరబడి మరి దాడి చేయడం దారుణమని కాలనీ వాసులు పేర్కొన్నారు. రోజా రాణి శరీరంపై దాదాపు 17 చోట్ల  వీధి కుక్క ఇష్టానుసారంగా రక్తం కారేలా కరిచి గాయాలు చేసింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించడం వలన ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ఈ సందర్భంగా డా. అనురాధ మాట్లాడుతూ... వీధి కుక్కలకు రేబిస్ వ్యాధి సోకే ప్రమాదం ఉందని, ఆ పిచ్చితనంలో అవి ఏం చేస్తున్నాయో వాటికి తెలియదని, కనిపించిన ప్రతి ఒక్కరిని కరిచి గాయం చేస్తాయని తెలిపారు. కావున వెంటనే మున్సిపల్ అధికారులు వీధి కుక్కలను పట్టుకొని  ప్రజల ప్రాణాలను కాపాడాలని కాలనీ వాసులు కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి మోతే వెంకటరెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కోశాధికారి బెల్దీ అశోక్, కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వి.శ్రీనివాస్, కార్యదర్శి శంకర్, మాజీ అధ్యక్షుడు కడియాల రమేష్, నాయకులు వెంకట్, రామచంద్ర మూర్తి టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు తదితరులు పరామర్శించి మనో ధైర్యం అందించారు.