calender_icon.png 19 October, 2024 | 1:54 AM

పారిశుద్ధ్య కార్మికురాలిపై వీధి కుక్కల దాడి

27-07-2024 10:16:31 PM

వీధి కుక్కల దాడిలో పారిశుద్ధ్య కార్మికురాలికి గాయాలు 

హైదరాబాద్: ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా వీధి కుక్కల బెడద నివారించలేక పోతున్నారు. ఏదైనా ఘటన జరిగినపుడే స్పందించే అధికారులు ఆ తర్వాత నిమ్మకు నిరేత్తినట్టూ వ్యవహారిస్తున్నారు. గత వారం వీధి కుక్కల దాడిలో జవహర్‌గనగర్‌లో 18 నెలల బాలుడు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా నగరంలో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి.

శనివారం మల్కాజిగిరిలోని గిరికృపా కాంప్లెక్స్ వద్ద విధులు నిర్వహిస్తోన్న పారిశుద్ధ్య కార్మికురాలిపై ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. స్థానికులు సకాలంలో స్పందించి కుక్కను అక్కడినుంచి తరిమికోట్టారు. తీవ్ర గాయాలు కావడంతో గమనించిన మున్సిపల్ సిబ్బంది ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.