calender_icon.png 20 April, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించండి

10-04-2025 01:39:44 AM

కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల డిమాండ్

విద్యామండలి కార్యాలయ ముట్టడికి యత్నం

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 12 వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నేతలు బుధవారం చలో హైదరాబాద్ తలపెట్టారు. ఇందులో భా గంగా పలు వర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాసాబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయ ముట్టడికి య త్నించారు.

కార్యాలయ గేటు ఎదుట బైటాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగడంతో పోలీసు వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్ చేసి, పలు పోలీసుస్టేషన్లకు తరలించారు. కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేసి, ఇప్పుడు విస్మరించడం సరికాదన్నారు.

చలో హైదరాబాద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళ వారం అర్ధరాత్రి నుంచే ముందస్తు అరెస్టులు చేశారని జేఏసీ నేతలు వాపోయారు. గౌరవప్రదమైన వృ త్తిలో ఉన్న తమను అరెస్ట్ చేయడా న్ని రాష్ట్ర నాయకులు బైరి నిరంజ న్, కర్ణాకర్‌రావు, రాజేశ్, జితేందర్‌రెడ్డి, శ్రీధర్ తదితరులు తీవ్రంగా ఖండించారు.

నేడు కేకే సమీక్ష..

కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల డిమాండ్లపై ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు గురువా రం సమీక్షించనున్నారు. ఉన్నత విద్యామండలి అధికారులతోనూ ఆయన సంప్రదింపులు జరపనున్నారు. రాష్ట్రం లోని 12 వర్సిటీల్లో రెగ్యులర్ కోర్సుల్లో 875, సెల్ప్ ఫైనాన్స్ కోర్సు ల్లో 365, పార్ట్‌టైమ్ కింద 927, గెస్ట్ ఫ్యాకల్టీగా 342, ఇతరులు 44 మందితో కలిపి 2,553 మంది పనిచేస్తున్నారు. వీరు రెగ్యులరైజేషన్, పేస్కేల్స్, హెల్త్‌కార్డులు, పీహెచ్‌డీ గైడ్‌షిప్ వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.