calender_icon.png 2 February, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాడి చేసిన వీధికుక్కలు పట్టివేత

02-02-2025 12:00:00 AM

శునకాల దాడిలో గాయపడిన బాలికకు యాంటీ రేబిస్ ఇంజక్షన్ 

 రాజేంద్రనగర్, ఫిబ్రవరి 1: వీధి కుక్కలు నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసిన నేపథ్యంలో జిహెచ్‌ఎంసి అధికారులు స్పందించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గోల్డెన్ హైట్స్ ప్రాంతంలో నాలుగేళ్ల చిన్నారి సుహాసినిపై శుక్రవారం వీధి కుక్కలు తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే.

దీంతో స్పందించిన డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాల మేరకు శనివారం జిహెచ్‌ఎంసి కుక్కలు పట్టుకునే బృందం ఘటన స్థలానికి చేరుకొని గాయపరిచిన శునకాలను పట్టుకున్నారు. అనంతరం గాయపడిన చిన్నారికి యాంటీ రేపిస్ట్ ఇంజెక్షన్లు వేయించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు..