calender_icon.png 3 October, 2024 | 6:27 PM

కోరపల్లిలో పిచ్చి కుక్క హల్చల్

03-10-2024 03:08:37 PM

దాడిలో ఐదుగురికి గాయాలు, చిన్నారికి తీవ్ర గాయాలు

హుజురాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో ఏదో మూలన ప్రతిరోజు కుక్కల దాడిలో చాలామంది గాయపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్తే చాలు అమాంతం మీదకు దూకి తీవ్రంగా గాయపరుస్తూ చిన్నపిల్లల మరణాలకు కారణం అవుతున్నాయి. చిన్నపిల్లలను బయటకి పంపాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అలాంటి సంఘటనే గురువారం హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం కోరపల్లిలో జరిగింది. ఉదయం 10 గంటల సమయంలో కోరపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ కనిపించిన వారిని గాయపరస్తు వెళ్ళింది.

కుక్క దాడిలో ఐదుగురు గాయాల పాలవ్వగా చిన్నారి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. కోరపల్లి గ్రామానికి చెందిన మద్దర్ల అక్షర అనే మూడేళ్ల చిన్నారిపై పిచ్చికుక్క విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచింది. చిన్నారికి తీవ్రంగా గాయాలు కావడంతో  ప్రస్తుతం హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై గ్రామస్తులంతా కలిసి గ్రామ పంచాయతీ ముందు నిరసనకు దిగారు.  గ్రామం లో కుక్కలు దాడి చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన తెలిపారు.