calender_icon.png 1 February, 2025 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారిని ఈడ్చికెళ్లిన వీధి కుక్కలు

01-02-2025 12:00:00 AM

రెండు కుక్కల దాడిలో తీవ్ర గాయాలు కాపాడిన స్థానిక మహిళలు 

రాజేంద్రనగర్, జనవరి 31 : ఓ చిన్నారిపై రెండు వీధి కుక్కలు దాడి చేసి ఈడ్చు కెల్లాయి. కొద్దిసేపటి తర్వాత స్థానిక మహిళలు రావడంతో కుక్కలు పారి పోయాయి. ఈ సంఘటన రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.

వివరాలు.. సుమారు 5 ఏళ్ల చిన్నారి రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ హిట్స్ ప్రాంతంలో ఉదయం ఆడుకుంటుండగా రెండు వీధి కుక్కలు వచ్చి ఆమెపై తీవ్రంగా దాడి చేసి ఆమె కాలును నోటితో పట్టుకొని కొద్ది దూరం ఈడ్చుకెల్లాయి.

చిన్నారి తీవ్రంగా రోదిస్తూ భయాందోళనతో కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న ఇద్దరు మహిళలు వచ్చి కాపాడారు. మహిళలు కుక్కలను తరిమి వేయడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.