calender_icon.png 23 November, 2024 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారిపై శునకాల దాడి

27-08-2024 02:50:14 PM

బత్కపల్లి గ్రామంలో ఘటన

చికిత్సకై ఆసుపత్రిలో చేరిక 

పిల్లలను బయటకు పంపేందుకు 

బయటపడుతున్న తల్లిదండ్రులు 

జగిత్యాల,(విజయక్రాంతి): ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై శునకాలు దాడి చేసిన ఘటన బత్కపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పిల్లలు బయటకు వెళితే శునకాలు ఎగబడి గాయపరుస్తున్నాయి. పిల్లల బయటకు పంపించేందుకు తల్లిదండ్రులు భయంతో వణుకుతున్నారు. జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం బత్కపల్లి గ్రామంలో పదకొండు నెలల చిన్నారి అనుష్క ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేసి గాయపర్చడంతో చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కుక్కలు తీవ్రంగా గాయపరచడంతో పదకొండు నెలల చిన్నారి అనుష్క పరిస్ఠితి విషమంగా మారింది. ఇది గమనించిన గ్రామస్తులు శునకాల తరిమికొట్టడంతో పారిపోయాయి. దీంతో చిన్నారికి పెను ప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు  ఊపిరిపీల్చుకున్నారు. శునకాల దాడిలో తీవ్ర రక్తపుగాయాలతో రోదిస్తున్న చిన్నారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కల బెడదతో చిన్నారులు కాదు పెద్దలు తమ పిల్లలను బయటకు పంపించేందుకు జనం హడలిపోతు న్నారు. శునకాల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించి బాలికకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.