calender_icon.png 19 April, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పరపల్లిలో ప్రజలపై వీధి కుక్కల దాడి

17-04-2025 09:53:23 AM

ఎనిమిది మందికి తీవ్ర గాయాలు 

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad district) కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున ప్రజలపై వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. దారి వెంట నడుస్తున్న వారితోపాటు ఇంటి ఆవరణలో ఉన్న వారిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి రక్కాయి. కుక్కల దాడిలో చాలామంది తలలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే కేసముద్రం, మహబూబాబాద్ ఆసుపత్రులకు(Mahabubabad hospital) తరలించి చికిత్స చేయిస్తున్నారు. కుక్కల దాడిలో గ్రామానికి చెందిన మహబూబీ, మంద రవి, సారయ్య, అల్లావుద్దీన్, బిజిగె సాయిలు, కంచ కోమల, పాపయ్య, ఎల్లయ్యతో పాటు మరికొందరు గాయపడ్డారు. గ్రామంలో ప్రజలపై వీధి కుక్కలు ఒక్కసారిగా విరుచుకు పడడంతో గ్రామంలో అనేకమంది గాయపడడంతో పరిస్థితి భయానకంగా మారింది. వెంటనే అధికారులు స్పందించి వీధి కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు.