calender_icon.png 2 February, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విచ్చలవిడిగా ప్రచార బోర్డులు

02-02-2025 12:41:12 AM

  • అనుమతులు లేకుండానే ఏర్పాటు 

ఎవరు పడితే వారు ఏర్పాటు చేసుకుంటున్న ప్రచార బోర్డులు 

అడిగితే జరిమానా విధిస్తామంటున్న మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 1 (విజయ క్రాంతి) : వ్యాపారానికి ప్రచారం ముఖ్యం. ప్రచారం చేసుకోవాలంటే ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు అనుమతులు అతి ముఖ్యమైనవి. కాగా కొందరు తమ వ్యాపా రాన్ని అంచలంచెలుగా ముందుకు తీసుకు పోయేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విషయంలో ఎలాంటి తప్పిదం లేదు. ఎవరు వ్యాపారం చేసినా ప్రచారం కావాలని కోరుకుంటారు.

కాగా మహబూబ్ నగర్ తమ వ్యాపారాలను రెట్టింపు చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం నిబంధనలు మాత్రం పట్టించుకోవడం లేదు. పట్టణంలో పుట్టగొడుగుల ప్రచార బోర్డులు వివిధ వ్యా పార సముదాయాల నిర్వాహకులు ఏర్పా టు చేస్తుండ్రు.

ఎందుకు మున్సిపల్ అధికా రుల అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఇలాంటి అనుమతులు లేకుండానే ప్రచారా నికి మాత్రమే ముగ్గు చూపుతుండ్రు. నిబం ధనలను అమలు చేయవలసిన అధికారులు మాత్రం కంటికి కనిపించిన ఆ పని మాది కాదేమో అనే విధంగా చర్యలు తీసుకోవ డంలో వెనుకంజ వేస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ఇష్టం సారంగా బోర్డులు...

ఎవరు పడితే వారి వ్యాపారానికి సంబం ధించి ఇష్టనుసారంగా ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన రోడ్లపై ఉన్న విద్యుత్ స్తంభాలకు వ్యాపార సముదాయ బోర్డులను ఏర్పాటు చేసి ప్రచారం చేసుకుం టున్నారు. ప్రభుత్వ అధికారుల అనుమతి మాత్రం ఆ వ్యాపారస్తులు పట్టించుకోవడం లేదు. అన్ని విషయాలు తెలిసిన ఎందుకు ప్రభుత్వానికి చెల్లించాలి అనుకుంటున్నారో ఏమో కానీ మున్సిపల్ అధికారులను పట్టిం చుకోకుండానే బోర్డులను ఏర్పాటు చేస్తుండ్రు. 

9 రూపాయలకే చీర... గుంపులు గుంపులుగా మహిళలు 

పట్టణంలో గత కొన్ని రోజుల క్రితం వెలసిన చెన్నై షాపింగ్ మాల్ నిర్వాకులు శనివారం మాత్రమే రూ 9 లకే ఒక చీర అందిస్తామని భారీ ఎత్తున ప్రచార బోర్డులు ఏర్పాటు చేశారు. కాగా మహిళలు మాత్రమే అర్హులని తెలుగులో పెద్ద ఎత్తున పట్టణ మంతా ప్రచారం బోర్డులను ఏర్పాటు చేయ డం జరిగింది. ఇది చూసిన మహిళలు పట్ట ణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల మహిళలు చెన్నై షాపింగ్ మాల్ కు పరుగు లు తీశారు. 

తీరా అక్కడికి వెళ్లి చూసిన తర్వాత కనీసం ఒక మహిళ రూ 175 ఏదైనా కొనుగోలు చేస్తేనే రూ 9 చీర అందిస్తామని నిర్వాహకులు సాఫీగా చెప్పారు. దీంతో అవ్వకైన మహిళలు కొందరు కొనుగోలు చేసిన మరికొందరు ఇదేమి ఇరకాట మంటూ అసనం వ్యక్తం చేశారు.

ఈ విష యంపై నిర్వాహకులను అడగగా కండిషన్ అప్లు అని ఇంగ్లీషులో రాయడం జరిగిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. వ్యాపా రాన్ని భారీ ఎత్తున చేసుకోవడం తప్పుకాదు కానీ రూ 9 చీర అని చెప్పి, ఇంగ్లీషులో చిన్న అక్షరాలతో కండిషన్ అప్లు అని రాస్తే ఎలా అని వినియోగదారులు కొంతమంది వేను తిరిగారు. 

జరిమానా విధిస్తాం

ఎవరి ఇష్టం సారంగా వారు బోర్డులు ఏర్పాటు చేసుకుంటే వెంటనే తొలగించి బాధ్యులకు జరిమానా విధించడం జరు గుతుంది. నిబంధన అతిక్రమించి రోడ్లపై బోర్డులను వివిధ వ్యాపార సముదా యాలు ఏర్పాటు చేయకూడదు. ము న్సిపల్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. 

- మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, మహబూబ్ నగర్