* సోషల్ మీడియాలో వీడియో వైరల్
ముంబై, డిసెంబర్ 29: ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారుండరు. మసాలాలతో ఘుమఘుమలాడే బిర్యానీ కీ అదేస్థాయిలో క్రేజ్ ఉంటుంది. ఈ రెండింటి కలయికతో రూపొందించి న వంటకం ఎలా ఉంటుంది! వినడానికే వింతగా ఉన్నా ఓ మహిళ రూపొందించిన ఐస్‌క్రీమ్ బిర్యానీపై ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోం ది.
ముంబైకి చెందిన హీనా కౌసర్ రాద్ బేకింగ్ అకాడమీని నడుపుతోంది. తన అకాడమీలో ఏడు రో జుల బేకిం గ్ కోర్సు ముగింపు సందర్భంగా ఆమె స్ట్రాబెరీ ఐస్‌క్రీమ్ బిర్యా నీని త యారు చేసింది. తన ప్రత్యేక వంటకం ఎలా ఉందో చెప్పాలంటూ సోష ల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ఈ వంటకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.