calender_icon.png 27 February, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హర్రర్ కామెడీగా అపరిచిత దారి

27-02-2025 12:00:00 AM

తిలక్ శేఖర్, అనిత భట్, హరీష్ రాజ్ ప్రధాన పాత్రల్లో రవి బాసర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అపరిచిత దారి’. డిఫరెంట్ కథ, కథనాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. పేపర్ సత్యనారాయణ,  సిరిముల్ల రవీందర్, దారుగుపల్లి ప్రభాకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతు న్నాయి. ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడలో ఒకేసారి విడుదల కానుంది.రహదారు ల్లో రాత్రిళ్లు జరిగే ప్రమాదాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. హర్రర్ కామెడీ జానర్‌లో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను నిర్మాత శిరీష్ రెడ్డి విడుదల చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విజయం సాధించి చిత్ర యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని కోరుతూ చిత్ర యూనిట్ సభ్యులకు శిరీష్ బెస్ట్ విషెస్ తెలిపారు.