అజయ్ దేవగణ్ అల్లుడు అమన్ దేవగణ్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తడాని ‘ఆజాద్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించగా, రోనీ స్క్రూవాలా, ప్రగ్యా కపూర్ నిర్మించారు. జనవరి 17న హిందీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ‘అజీబ్- అనే కొత్త ట్రాక్‌ను వదలారు. గుర్రాలు తమ ప్రేమకథలను వ్యక్తీకరించే ప్రపంచంలోకి ఇది ప్రేక్షకులను తీసుకువెళ్తుందీ పాట. ఈ పాటను అరిజిత్ సింగ్, హన్సిక పాడాడు. గీత సాహిత్యాన్ని అమితాబ్ భట్టాచార్య అందించగా, అమిత్ త్రివేది సంగీతం సమకూర్చారు.