కోనరావుపేట, ఫిబ్రవరి 6: కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో కుక్కల బెడద ఎక్కువ అవుతోంది. కుక్కల కారణంగా ఓ చిన్నారికి వైరస్ సోకడంతో హైద్రాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలు ఇలాఉన్నాయి. మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన చేపూరి శ్రీమేథ (4) అనే చిన్నారికి జ్వరంతో పాటు శరీరంపై అలర్జీ ఏర్పడింది.
అవి ఎక్కువ కావడంతో చిన్నారిని సిరిసిల్లలోని ఆస్పత్రికి తరలించారు.అన్ని రకాల పరీక్షలు చేసినా నిర్ధారణ కాకపోవడంతో నాలుగు రోజుల క్రితం హైద్రాబాద్లోని ప్రైవేట్ వ్యర్థాలు తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి బ్రూసెల్లా ఇదిపీకల్ వైరస్ గా గుర్తించారు. కలుషితమైన చికెన్ వ్యర్థాలు,
నీటిని తాగడం వల్ల, పచ్చి మాంస వ్యర్థాలు తినడం వల్ల కుక్కలకు సోకుతుందని, అవి తిరిగినసోకుతుందని, అవి తిరిగిన ప్రదేశాలలో చిన్నారులు తిరిగితే ఈ వైరస్ సోకుతుందని తెలిపారు. కాగా గ్రామంలో గత కొన్ని నెలలుగా కుక్కల బెడద ఎక్కువగా అవుతుందని, వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.