* 150 మంది మృతి
కిన్షాషా, డిసెంబర్ 7: ఆఫ్రికాలోని కాంగో దేశం అంతుచిక్కని వింత వ్యాధితో వణికిపోతోంది. ఈ వ్యాధి కారణంగా 150 మంది చనిపోయారు. ఇప్పటివరకు పాంజీ హెల్త్ జోన్‌లో నవంబర్ 10 నుంచి 25 మధ్య దాదాపు 150 మందికి పైగా మరణించారని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. ఫ్లూ వంటి లక్షణాలతో ప్రజలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి, దగ్గు, నీరసం వంటివి ఈ వ్యాధి లక్షణాలని ఆరోగ్యమంత్రి యుంబా తెలిపారు. వ్యాధితో బాధపడుతున్న వారు ఇళ్లలోనే చనిపోతున్నారు. కాగా రోగుల నుంచి నమూనాలను సేకరించేందుకు వైద్య బృందం హెల్త్ జోన్‌కు చేరుకుంది.