సంజయ్రాయ్ మాట వినిపించకుండా హారన్లు
కోల్‌కతా, నవంబర్ 18: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా హత్యాచార ఘటన ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ విషయంలో కోల్‌కతా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ఇటీవల అతడిని కోర్టు నుంచి బయటకు తీసుకువస్తుండగా అతడి కేకలు మీడియాకు వినిపించకుండా పోలీసులు ఏకధాటిగా వాహనాల హారన్లను మోగించారు.
ఈ కేసు విషయమై నవంబర్ 11న నిందితుడు సంజయ్‌ను కోర్టుకు తీసుకువచ్చినప్పుడు.. అతడు సంచలన ఆరోపణలు చేశాడు. తాను నిర్దోషినని.. కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ ఈ కేసులో తనను ఇరికించారని.. పోలీస్ వ్యాన్ నుంచి గట్టిగట్టిగా సంజయ్ కేకలు వేశాడు. మరోసారి అలాంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతోనే పోలీసులు తాజాగా హారన్లు మోగించారని తెలుస్తోంది.