calender_icon.png 4 November, 2024 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరుగా ఫైనల్లోనే

14-05-2024 01:54:29 AM

బరిలోకి దిగనున్న నీరజ్ చోప్రా

నేషనల్ ఫెడరేషన్ కప్ 

భువనేశ్వర్: నేషనల్ ఫెడరేషన్ కప్‌లో భారత స్టార్ అథ్లెట్  నీరజ్ చోప్రా నేరుగా ఫైనల్లోనే బరిలోకి దిగనున్నాడు. అతడితో పాటు కిషోర్ కుమార్ జెనా కూడా ఫైనల్స్‌లోనే దర్శనమివ్వనున్నాడు. క్వాలిఫయింగ్ రౌండ్‌లో నిర్థరించిన 75 మీటర్ల కటాఫ్‌ను ఈ ఇద్దరు చాలాసార్లు అధిగమించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత అథ్లెటిక్స్ హెడ్‌కోచ్ రాధాకృష్ణ నాయర్ పేర్కొన్నాడు.‘జావెలిన్ విభాగంలో పాల్గొననున్న అథ్లెట్లలో 9 మంది ఇప్పటికే 75 మీటర్ల కటాఫ్‌ను అధిగమించారు. వీరంతా నేరుగా ఫైనల్స్‌లో బరిలోకి దిగుతారు. ఇక 75 మీటర్ల కంటే తక్కువ దూరం విసిరిన అథ్లెట్లు క్వాలిఫయింగ్ రౌండ్‌లో పాల్గొంటారు. వీరిలో టాప్‌వో మిగతా 9 మందితో కలిసి ఫైనల్స్ బరిలో ఉంటా రు.’ అని రాధాకృష్ణ తెలిపాడు.

ఇక గతవారం దోహా వేదికగా జరిగిన డైమండ్ లీగ్‌లో నీరజ్ రజతంతో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ లీగ్ ఫైనల్లో  నీరజ్.. జావెలిన్‌ను 88.38 మీటర్ల దూరం విసిరాడు. ఇక కిషోర్ జెనా 76.13 మీటర్లు విసిరి ఎలిమినేట్ అయినప్పటికి ఫెడరేషన్ కప్‌లో నేరుగా ఫైనల్స్ ఆడనున్నాడు. 2023 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆరో స్థానంలో నిలిచిన డీపీ మను కూడా నేరుగా ఫైనల్స్‌లోనే బరిలోకి దిగనున్నాడు.  ఇక మంగళవారం జావెలిన్ త్రో విభాగంలో క్వాలిఫికేషన్ రౌండ్ జరగనుండగా.. గురువారం ఫైనల్ ఫైట్  జరగనుంది.