calender_icon.png 6 March, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కథ

24-02-2025 12:00:00 AM

యాజులు నెల్లూరి జిల్లా కోర్టులో గుమాస్తాగా ఉండినప్పటి సంగతి.ఇక నెలా పదిహేనురోజులుందనగా, సంకురాత్రి పండుక్కి రాధ మ్మని పుట్టింటివారు తీసుకెళ్లరని తే లిపోయింది. అప్పటికామె పద్దెనిమిదేళ్ల పిల్ల. పండుగులనీ, పబ్బాలనీ, అచ్చట్లనీ, ముచ్చట్లనీ కిందా మీదా పడిపోతూ ఉండే వయస్సు. దగ్గిరగా ఉన్నంత కాలమూ పుట్టింటి వారామెకి లాంఛనాలన్నీ బాగానే తీర్చేవారు. కానీ నెల్లూరికి, పిఠాపురానికీ రానూ పోనూ కూతురికీ, అల్లుడికీ కావలసిన రైలు ఖర్చు ల మొత్తం తెలిసేటప్పటికి వారికి గుండెలాగిపోయాయి.

ఇది ఆలోచించి చివరికి రాధమ్మ కూడా సరిపెట్టుకుంది.

మొదట మాత్రం తండ్రి రాసిన ఉత్తరం చూసుకొని ఆమె నిర్ఘాంత పడిపోయింది. ఇది యాజులు గు ర్తించాడు. అతని హృదయం దడదడ కొట్టుకుంది. కాని ఒక్క క్షణంలో తేరుకుని, ఆమె కళ్లల్లోకి జాలిగా చూ సి, తన వెచ్చని పెదవులతో తాకి ఆమె పెదవులకు చలనం కలిగించుకున్నాడు.

తరువాత “మడి కట్టుకోండి” అంటూ ఆమె వంటింట్లోకి వెళ్లిపోయింది.

అతను తాపితా కట్టుకున్నాడు. కుచ్చెళ్లు పోసుకునేటప్పుడు ‘రెండేళ్ల కిందట విజయదశమినాడు నీ అత్తవారిచ్చారు నీకిది. ఇంత గొప్పవి కాకపోయినా, ప్రతీ సంవత్సరమూ నువ్వు నీ అత్తవారి బహుమతులు క ట్టుకుంటూనే ఉన్నావు. కానీ పుట్టిం టి వారిస్తూనే ఉన్నారు గదా, లోటు లేదు గదా అనుకుంటున్నావే కాని రాధకి నువ్వొక్క చీర అయినా కొనిపెట్టావా పాపం? చిలక వంటి పెళ్లా నికి మొగుడు చూపించవలసిన ము రిపెం ఇదేనా? చివరకి వొక్క రైక అ యినా కుట్టించావా? నీకిది బాగుందనిపించిందా?’ అని ఎవరో నిల వతీసి అడిగినట్టనిపించింది.

దీంతో వల్లమాలిన సిగ్గు వచ్చి ఊదర గొట్టేసింది.

దాని మీది ‘ఇప్పుడైనా రాధకొక మంచి చీర కొని ఇవ్వాల’నుకున్నా డు. ‘ఇచ్చి తీరాలి. పండుక్కి కొత్త చీర లేని లోటు కలగనివ్వకూడదు’ అని దృఢ పరుచుకున్నాడు. కానీ, డబ్బేది?

ఏ నెల జీతం ఆ నెలకే చాలీచాలనట్టుంది. అక్కడికీ నెల్లూరిలో ఇంటి అద్దెలు చౌక కనుక సరిపోయింది. కాని లేకపోతే ఎన్ని చేబదుళ్లు చేస్తూ, ఎన్ని వొడిదుడుకులు పడవలసి వచ్చేదో?

రాధమ్మ కూడా పొదుపైన మని షి కనక ఆట సాగుతోంది. కానీ కాకపోతే, ఆ చేబదుళ్లకు సాయం ఎన్ని అరువులు పెరిగిపోయి ఉండునో?

ఏమైనా చీరకొని తీరాలని శపథం పట్టుకున్నాడు.

ఖర్చులు తగ్గించుకోడం తప్ప మార్గాంతరం కనపడలేదు. ఆ ఖర్చులలో నేనా సంసారం కోసం రాధ మ్మ చేసేవాటిలో తగ్గించడానికి వీ లు కనపడదు.

దీనిమీద ‘నా ఖర్చులు తగ్గించుకుంటా’నని అతను నిశ్చయించుకున్నాడు.

అది మొదలు అతను నాటకాలకి వెళ్లడం కట్టి పెట్టేశాడు. పుస్తకాలు కొనడం మానేసి భాండాగారానికి వెళ్లసాగాడు. ఒకటి రెండు

వినోదయాత్రలు చాలించుకున్నాడు. కోర్టుకి వెళ్లేటప్పుడు, వచ్చే టప్పుడూ బండెక్కడం తగ్గించుకున్నాడు. మధ్యాహ్నం కోర్టు దగ్గర ఫలహారం ఒక్కటే కాదు, కాఫీకూడా మానుకొన్నాడు.

పొద్దుటి పూట మాత్రం ఇంటిదగ్గర కాఫీ సేవ మానుకోలేదు. అంచే త రాధమ్మ కిదేమీ తెలవకుండా జరిగిపోయింది.

****

ఆ వేళ పెద్ద పండుగ.

మధ్యాహ్నం రెండు గంటల సమయంలో యాజులు, రాధమ్మ ఏం చేస్తోందో చూద్దామని వసారాలోకి వెళ్లి జంట వెదురు కుర్చీలో కూచున్నాడు. ఉ న్న చీరల్లో మంచివి నాలుగు పట్టు కు వచ్చి “వీట్లో ఏది కట్టుకోను చెప్పండి” అంటూ రాధ మ్మ పక్కన కూచుంది.

“నన్నడగడం ఎందుకూ?”

“మంచి చీర కట్టుకోవడం 

మీ కోసమా? నా కోసమా?”

“నా కోసమే. అయితే, ఆ చీరలన్నీ మీ వాళ్లిచ్చినవి. వాటిమీద నాకేమీ అధికారం లేదు”

“అదేమిటండీ?”

“ఎకసక్కెం చెయ్యడం లేదు నేను”

“చె- పెడర్థాలు తియ్యకా”

ఇలా గునుస్తూ ఆమె కుడిచెయ్యి అతని నడుముకి చుట్టేసింది.

దానిమీది, ఆనందమూ, ఉద్వేగ మూ అతికష్టం మీద అణచుకుం టూ అతను “నేను మానెయ్యమన్న ది మానేసి కట్టుకోమన్నది కట్టుకుంటావా?” అని గంభీరంగా ప్రశ్నిం చాడు.

“ఆ”

“అయితే, అవన్నీ పెట్టెలో పెట్టేసి రా”

ఆమెకేమీ అర్థం కాలేదు. అయి నా, ఏదో లేకుండా అతనలా చెప్పడని యెరుగును కనుక, అతనికి అ డ్డుమాట చెప్పలేదు కూడా కనుక, వొక్కమాటు గంభీరంగా చూసి అవి ఇంట్లో పెట్టేసి వచ్చి, మళ్లీ పక్కన కూ చుని “మరి చెప్పండి” అని అడిగింది.

వెంటనే అతనొక్క మాటు మం  దహాసం మొలిపించి, అతి తాపీగా లేచి, అతి దర్జాగా వాకిట్లోకి వెళ్లి మేజా సొరుగులో నుంచి వొక పొ ట్లం తీసుకువచ్చి అతిప్రేమతో ఆమెకందించి దగ్గిరగా కూచున్నాడు.

ఆమె చేతులు గబగబలాడిపోయాయి.

విప్పి చూడగా, అల్ల నే రేడు పండు చాయతో నిగనిగ మెరిసిపోతూ పుల్లం పేట జరీచీర.

“ఇదెలా వచ్చిందండీ?” అని అడుగుతూ ఆమె మడత విప్పింది. వెంటనే మైజారు కొంగున ఉన్న జరీ నిగనిగ ఆమె కళ్లలోనూ, చెక్కిళ్ల మీదా, పెదవుల మీదా తళుక్కుమంది.

దాంతో అతని మొగం మరీ 

గంభీరముద్ర వహించింది.

“చెప్పండీ”

“వెళ్లి కట్టుకురా..”

“మానేస్తానా ఏమిటి చెఝూ

“చెప్పనా ఏమిటి కట్టుకురా”

ఆమె గదిలోకి వెళ్లి మడత పూర్తిగా విప్పగా ఏదో కింద పడింది. “ఇందులో పట్టు జాకెట్టు కూడా ఉందండీ?”

“ఇంకేం, తొడుక్కురా”

యాజులిక్కడ మాట్లాడకుండానే కూచున్నాడు. కాని “మామిడిపిందె లించక్కున్నాయో!” “బాబోయ్ పద్దెనిమిది మూళ్ల పొడుగున్నట్లుంది” “మా అమ్మ ఇలాంటిది వొక్కటీ పెట్టలేకపోయింది” “ఎన్నాళ్ల నుం చో మనసు పడుతున్నానీ రంగు కో సం. పాపం, చెప్పినట్టు తెచ్చిపెట్టా రు” అంటూ అక్కడ రాధమ్మ రిమార్కుల మీద రిమార్కులు దొర్లిం చేసింది.

అది విని తన కష్టం పూర్తిగా 

ఫలించినందుకతను చాలా 

సంతోషించాడు.

తరువాత ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చి వొళ్లో కూచుని ఆమె “ఇదెలా వచ్చింది చెప్పరూ?” అని మళ్లీ అడిగింది.

“పుల్లంపేటలో వొక 

దేవాంగి నేశాడు”

“ఊహూ”

“అది తెప్పించి నాతా 

సుదర్శనశెట్టి నెల్లూరి పెద్దబజారులో పెట్టి అమ్మాడు”

“సరే”

“నేను కొన్నాను”

“బాగుంది”

“నువ్వు కట్టుకొన్నావు”

“ఎలా వచ్చింది?”

“మళ్లీ మొదలా?”

“మరి నా ప్రశ్న అలాగే 

ఉండిపోయింది కదూ!”

“లేదు, బాగా ఆలోచించుకో”

“పోనీ, ఇది చెప్పండి 

డబ్బెక్కడిదీ?”

“మన ఇంట్లోదే!”

“నాకు తెలవకుండా 

ఎలా వచ్చిందీ?”

“మిగిలిస్తే వచ్చింది”

“ఎవరూ?”

“నేను”

“ఎలా మిగిల్చారూ?”

అతను రెప్ప వెయ్యకుండా చూశాడు.

“చెప్పరు కదూ? 

అయితే నన్ను

“ఆగు... ఆగు... ఇవాళ 

పెదూటోద్ద పండుగ. 

అలాంటి మాటలు రాకూడదు”

“అయితే మరి చెప్పండి”

యాజులు జరిగిందంతా చెప్పా డు. కానీ, నమ్మలేక ఆమె “నిజం గా?” అని చెయ్యి చాపింది.

“అక్షరాలా నిజం. ముమ్మాటికి నిజం” అంటూ అతనా చేతిలో 

చెయ్యి వేసి, ఆ చెయ్యి గిల్లాడు.

ఆమె మనస్సు గుబగుబలాడి పోయింది. హృదయం నీరయి పో యింది. కళ్లు చెమ్మగిల్లాయి. 

“చూశారా? నా చీర కోసం కా రెండలో నడిచి వెళ్లారా? అక్కడ కడుపు మాడ్చుకొని ఉసూరుమం టూ పని చేశారా? చీర లేకపోతే నా కు పండగ వెళ్లదనుకున్నారా? నేను రాకాసినా?” అని ఇక మాట్లాడలేక చేతులు అతని కంఠానికి పెనవేసి తన శిరస్సు అతని భుజం మీద ఆనుకుని దుఃఖించసాగింది.

అది చూసి, మొదట అతను నిర్విణ్ణుడయిపోయాడు. కానీ తరువాత “ఛా! ఏడుస్తావా? నేను ఏది వద్దనుకున్నానో అదే చేస్తావా? ఇలా చూ డు, అబ్బే! అయితే నాకూ నీకూ మాటల్లేవు. నాకూ నీకు జత లేదు” అని బెదిరిస్తూ మూతి బిడాయించుకుని ఆమె మొగం పైకెత్తి కొంటె చూపులు చూశాడు.

ఏడ్పల్లా ఆమెకి నవ్వయి

పోయింది.

“మరి నాతో ఎందుకు చెప్పారు కారూ? నేను మాత్రం కాఫీ మానుకోక పోదునా? దాంతో మీ క్కూడా జామారు రాకపోవునా?”

“ఇప్పుడు రాకపోతేనా?”

“ఏదీ చూపించరూ?”

ఇద్దరూ లేచారు. ఒకర్ని వొకరు పొదివి పట్టుకుని వాకిట్లో మేజా దగ్గరకి వెళ్లారు. యాజులు సొరుగు లాగి వెంకటగిరి సరిగంచు చాపు పైకి తీశాడు.

అది చూసి, ఆమె సంతోష విహ్వల అయి “మరి తొరగా కట్టేసుకోండి” అంటూ అతని భుజాలు ఊపేసింది.

కథా కాలం: 1940, 

ఆంధ్రభూమి,

‘కథా నిలయం’ సౌజన్యంతో..