calender_icon.png 22 April, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో ఈదురుగాల బీభత్సం

22-04-2025 02:11:35 AM

రైల్వే ట్రాక్ పై విరిగిపడ్డ చెట్టు  స్థానికుల అప్రమత్తతో తప్పిన ప్రమాదం 

వికారాబాద్, ఏప్రిల్ -21  జిల్లాలోని పలుచోట్ల సోమవారం మధ్యాహ్నం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. వికారాబాద్ నుండి బీదర్ వెళ్లే రైల్వే ట్రాక్ పై  మమదన్ పల్లి గ్రామ సమీపంలో  ఈదురుగాలులకు చెట్టు విరిగి పడటంతో రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.

ఈ విషయం గమనించిన స్థానికులు అప్రమత్తమై రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైళ్ల రాకపోకలను 30 నిమిషాల పాటు  నిలిపివేశారు. స్థానికుల సహకారంతో విరిగిపడ్డ చెట్టును రైల్వే ట్రాక్ పైనుంచి తొలగించారు.

ఇదిలా ఉండగా వికారాబాద్ నుంచి స దాశివపేట వెళ్లే ప్రధాన రోడ్డుపై ఓ బారి చెట్టు విరిగిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. తాండూరు, పరిగి ప్రాంతాల్లో కూడా ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.