11-04-2025 12:37:36 AM
నారాయణఖేడ్, ఏప్రిల్ 10నారాయణఖేడ్ ప్రాంతంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం నుండి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నారాయణఖేడ్ పట్టణంలోని శివాజీ చౌక్ లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల రేకులు సైతంఎగిరిపడ్డాయి.