calender_icon.png 20 April, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవునిపల్లిలో గాలివాన బీభత్సం

17-04-2025 01:12:57 AM

లక్షల రూపాయల నష్టంతో మామిడి రైతు ఆవేదన 

షాద్నగర్, ఏప్రిల్ 16: రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండ లం దేవునిపల్లిలో మంగళవారం సాయంత్రం సంభవించిన గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి స్వప్న అంజన్న ఫామ్స్లోని 40 ఎకరాల మామిడి తోటలో చేతికొచ్చిన పంట నేలరాలింది. దీంతో కౌలు రైతు తీవ్రంగా నష్టపోయాడు.

కౌలు రైతు శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఏడాది మామిడి పంట తక్కువగా ఉండగా ఉన్న కొద్దిపాటి కాయలు కూడా గాలి దుమారానికి నేల రాలాయి. దీనివల్ల సుమారు రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి తోటను కౌలుకు తీసుకున్నానని, ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం వల్ల ఆర్థికంగా చితికిపోయానని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ అకాల నష్టంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ ప్ర భుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన ఈ నష్టానికి పరిహారం అందించాలని ఆయన కోరుతున్నారు. కాగా, నష్టపోయిన రైతుల వివ రాలను సేకరించాలని ఉద్యానశాఖ అధికారులను స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన మామిడి రైతులకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.