calender_icon.png 19 April, 2025 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేవెళ్లలో గాలివాన బీభత్సం

18-04-2025 12:16:09 AM

బీజాపూర్ హైవేపై విరిగి పడ్డ భారీ మర్రి వృక్షం

చేవెళ్ల, ఏప్రిల్ 17: చేవెళ్ల మున్సిపాలిటీతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది.   ఈదురు గాలులతో కూడిన వర్షం దాటికి చేవెళ్ల మున్సిపాలిటీలోని ఓ ఫ్లెక్సీ విరిగి విద్యుత్ వైర్లపై పడడంతో పాటు బీజాపూర్ హైవేపై మిర్జాగూడ ఖానాపూర్ గ్రామాల మధ్యలో భారీ మర్రి వృక్షం నేలకొరిగింది.

ఈ చెట్టు రోడ్డుపై పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.   పోలీసులు, సంబంధిత అధికారులు స్పందించి చెట్టును రోడ్డుపై నుంచి తొలగించి... ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అంతేకాదు పలు గ్రామాల్లో వరి, మామిడి తోటలతో పాటు ఆరుతడి పంటలకు కూడా నష్టం వాటిల్లింది.