calender_icon.png 23 October, 2024 | 7:04 AM

తుపాను హెచ్చరికలే తప్పుతున్నాయి

19-10-2024 12:00:00 AM

తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలను గత నాలుగైదు రోజులుగా గడగడలాడించిన తుపాను చివరికి ఎలాంటి ఉపద్రవం సృష్టించకుండానే కనుమరుగవడంతో ఆయా రాష్ట్రాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా చెన్నైతో పాటుగా తమిళనాడులోని అయిదు జిల్లాలు, ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లా వాసులకు  తుపాను కంటిమీద కునుకు లేకుండా చేసింది.

పంట చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావర ణ శాఖ హెచ్చరికలతో అన్నదాత దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ధనవంతులయితే హోటళ్లకు బసమార్చారు. మరి పేదవా డి మాటేమిటి? వాతావరణ శాఖ బులెటిన్లే సరిగా లేకపోతే ఎలా? ఒక్కోసారి ఈ అంచనాలు తప్ప య్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. అయితే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి?

 నరసింహరాజు, ఖమ్మం