calender_icon.png 12 October, 2024 | 5:42 AM

మిల్టన్ తుఫాను బీభత్సం

12-10-2024 12:58:41 AM

14కు పెరిగిన మృతుల సంఖ్య

వాషింగ్టన్, అక్టోబర్ 11: హరికేన్ మిల్టన్ ధాటికి అమెరికాలో గురువారం నాటికి మరిణించినవారి సంఖ్య 14కు చేరింది. దీని ప్రభావం ప్రధానంగా ఫ్లోరిడా రాష్ట్రంపై కన్పించింది. తుఫాన్ ధాటికి ఫ్లోరిడాలోని హిల్స్‌బరో, పినెలాస్, సారసొటా, లీ కౌంటీ తదితర ప్రాంతాల్లో సుమారు 34లక్షల మందికిపైగా ఇబ్బంది పడ్డారు. రోడ్లపై చెట్లు, విద్యుత్ తీగలు విరిగిపడ్డాయి.

పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సెయింట్‌లూసీ కౌంటీలో చిక్కుకు న్న 25మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ కారణంగా రాత్రిపూట సముద్రంలో చిక్కుకున్న ఓ మత్స్యకారుడు.. ఫ్లోరిడా తీరానికి 48 కిలోమీటర్ల దూరంలో ఓ మంచుపెట్టె ఆధారంగా చేసుకొని ప్రాణా లు కాపాడుకున్నాడు.  అతనిని కోస్ట్‌గార్డ్ సిబ్బంది హెలికాఫ్టర్ ద్వారా గజ ఈతగాడిని పంపి రక్షించారు.