అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ రోజు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఈ మూవీ హిందీ ట్రైలర్‌ను ముంబైలో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. “తండేల్ ట్రైలర్ నాకు చాలా నచ్చింది.
ఫెంటాస్టిక్‌గా ఉంది. డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశారు” అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ.. “తండేల్’ కథ చెప్పినప్పుడే నాకు చాలా ఎక్సుటైంగ్‌గా అనిపించింది. ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. శ్రీకాకుళం వెళ్లి అక్కడ మత్స్యకారుల్ని కలుసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన సంఘటనలు విన్నప్పుడు ఈ సినిమా నాకు ఎంత ఛాలెంజింగ్‌గా ఉంటుందో అర్థమైంది. ఇలాంటి కథలు యాక్టర్స్‌కి అరుదుగా వస్తాయి” అన్నారు.
చందూ మొండేటి మాట్లాడుతూ.. “ఇది బ్యూటీఫుల్ లవ్ స్టొరీ. రాజు అనే క్యారెక్టర్ కరాచీలో తన మనుషుల కోసం ఏం చేశాడనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది” అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “తండేల్ నిజంగా జరిగిన కథ.
వైజాగ్ తీర ప్రాంతంలోని కొందరు వ్యక్తులు చేపల వేటకు గుజరాత్ వెళ్లి పొరపాటున బోర్డర్ క్రాస్ చేసి పాక్ సైన్యం చేతిలో చిక్కుకొని జైలు పాలైనవారి కథ. జైలు సీన్స్, విలేజ్ సీన్స్, లవ్ స్టొరీ ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటాయి” అన్నారు.