03-04-2025 01:21:45 AM
హైదరాబాద్, ఏప్రిల్ 2: నగరంలోని కంచ గచ్చిబౌలి భూముల్లో గురువారం (ఏప్రిల్ 3)వరకు పనులు ఆపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కంచ గచ్చి బౌలి భూములపై వట ఫౌండేషన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఒక్కరోజు పనులు ఆపాలని, తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
అటవీభూములు కాదు..
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ (అడ్వొకేట్ జనరల్) సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపి స్తూ..‘2004లో ఈ భూములను ఐఎంజీ అకాడమీకి అప్పగించారు. ఒప్పందం ప్రకారం ఐఎంజీ ఆ భూములను వాడుకోపోవడంతో అప్పటి ప్రభుత్వం కేటాయింపును రద్దు చేసింది. ఆ భూముల్లో అటవీ భూమి అని ఎక్కడా పేర్కొనలేదు. దీని పక్కనే ఉన్న హెచ్‌సీయూ భూము ల్లో భారీ భవనాలు నిర్మించారు.
నాలుగు హెలీప్యాడ్‌లున్నాయి.. అలాగే నగరంలో పలు ప్రాంతాల్లో వివిధ జీవరాశులు, చెట్లు ఉన్నాయి. పిటిషనర్ల ప్రకారం ఆ భూములను కూడా అటవీ భూములుగా ప్రకటించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్‌లో ఎక్కడా నిర్మాణాలు చేపట్టవద్దు’అని పేర్కొన్నారు. వాదనలు కొనసాగిస్తూ.. కంచ గచ్చిబౌలి భూములను ప్రభుత్వం ఎక్కడా కూడా అటవీ భూములుగా నోటిఫై చేయలేదన్నారు.
ఇది పూర్తిగా పరిశ్రమలు, ఇతర అవసరాలకు వాడుకునేందుకు కేటాయించిన స్థలమేనని, అటవీ భూమి కాదన్నారు. ఏజీ చెప్పిన వాదనకు హై కోర్టు స్పందిస్తూ.. ఈ 400 ఎకరాలు పరిశ్రమల భూ మి అని రికార్డుల్లో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించిం ది.
దీనికి ఏజీ సమాధా నమిస్తూ సర్వే నెంబర్ 25లో ఉన్న ఈ భూములను పలు అవసరాలకు కేటాయిస్తూ వచ్చారని తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం గురువారం వరకు ఆ భూముల్లో పనులు ఆపా లని.. విచారణను వాయిదా వేసింది.మధ్యాహ్నం 2:15 గంటలకు కేసును విచారిస్తామని స్పష్టం చేసింది.
భూములను పరిరక్షించాలి..
వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థుల తరఫున న్యాయవాది ఎల్.రవిశం కర్ వాదనలు వినిపిస్తూ..‘2024 జూన్ లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 54 ప్రకారం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసీకి ఇస్తున్నట్టు పేర్కొంది. ఒకవేళ అది ప్రభుత్వ భూమే అయి నా సుప్రీం తీర్పులకు లోబడే పనిచేయాలి.
ఆ భూముల వద్ద బుల్డోజర్లను ఉపయోగించి చెట్లను కొట్టేసి, భూమిని చదును చేస్తున్నారు. సుప్రీం తీర్పు ప్రకా రం అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలన్నా, అలాగే వన్యప్రాణులు ఉన్నచోట భూములు చదును చేయాలన్న నిపుణుల కమిటీ వేయాలి. తగిన అధ్యయనం చేయాలి. ఆ ప్రాంతంలో మూడు చెరువులు, గుట్టలు ఉన్నా యి.
అరుదైన జంతువులు ఉన్నాయి. వాటిని పరిరక్షించాల్సిన అవసరముంది. ఇక్కడి అధికారులు సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవ హరిస్తున్నారు. గతకొన్ని రోజులుగా ఈ భూము ల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.’ అని న్యాయస్థానానికి తెలిపారు.