02-04-2025 12:37:20 AM
కరీంనగర్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మానుకోవాలని, గతంలో మానేర్ డ్యామ్ డెడ్ స్టోరేజ్ కు వచ్చినప్పుడు మేము ధర్నాలు చేస్తే మంత్రిగా ఉండి పట్టించుకోని గంగుల కమలాకర్ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు.
మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడున్న 5.7 టిఎంసి నీటితో కలిపి ఈ నెల 15 తారీఖు వరకు 6.5 టిఎంసి వరకు నిల్వ ఉంటుందని తెలిపారు.మిడ్ మానేరు నుండి సరిపోయేంత నీటిని లోయర్ మానేరు డ్యామ్ కు తరలిస్తామని అన్నారు. జూలై నెల వరకు కరీంనగర్ కార్పొరేషన్ త్రాగు నీటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే గంగులకు అన్నీ తెలిసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకం తీసుకరావడాన్ని ప్రతి పక్షాలు తట్టుకోలేక పోతున్నాయని, గతంలో దొడ్డు బియ్యం రీసైక్లింగ్ చేసి బిఆర్‌ఎస్ నాయకులు కోట్ల రూపాయలు సంపాదించారని నరేందర్ రెడ్డి ఆరోపించారు.
ఈ సమావేశంలో దన్న సింగ్,గుండాటి శ్రీనివాస్ రెడ్డి, జిడి రమేష్, దండి రవీందర్, కీర్తి కుమార్, ఆస్తాపురం రమేష్, జూపాక సుదర్శన్, ఉప్పరి అజయ్, సాయిరాం, మాసుం ఖాన్, బషీర్,ఇమామ్, ఆంజనేయులు,యనమల మంజుల, హనీఫ్, మామిడి సత్యనారాయణ రెడ్డి, వాడి వెంకట్ రెడ్డి, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.