26-03-2025 05:47:36 PM
అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి..
ఏఏఎస్ భద్రాద్రి జిల్లా ఇంచార్జ్ బొడికల ప్రేమ దయాళ్..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): అధికారులు ప్రజలకు జవాబుదారీ తరంగా వ్యవహరించాలని ఏఏఎస్ జిల్లా ఇంచార్జ్ బి ప్రేమ్ దయాల్ అన్నారు. సింగరేణి సంస్థలోని పలు ప్రభుత్వ శాఖలలో సమాచార హక్కు చట్టం అమలు విషయంలో అధికారులు అవలంభిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. సమాచార హక్కు సాధన స్రవంతి సంస్థ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బండ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆజాద్ అదికార్ సేన పార్టీ జిల్లా ఇంచార్జ్, RTI ఆక్టివిస్ట్ బోడికల ప్రేమ దయాళ్ సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... సింగరేణి సంస్థలో నెలకొన్న అవినీతి, అక్రమాలపై అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పౌర సమాచార అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు పలు సమస్యల పరిష్కారం దిశగా ఆయన గళం విప్పారు. అధికారులు ఇష్టరీతిగా ఒక విభాగానికి సంబంధించిన సమాచారన్ని కోరగా పూర్తి స్థాయిలో దరఖాస్తులను పరిశీలించకుండా మరొక విభాగానికి పంపి సమాచారం దాచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పలు కీలక శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకపోవడం వెనక అనేక అనుమానాలకు తావిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మికులకు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా, పారదర్శకత లోపించే విధంగా బాధ్యత రాహిత్యగా సింగరేణి అధికారుల వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేశారు. పబ్లిక్ డొమైన్ లో ఉండాల్సిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచకుండా, సెక్షన్ 8(1)J, సేక్షన్ 7(1) చూపుతూ సమాచారాన్ని దాటవేసే ధోరణిలో ప్రజా సమాచార అధికారులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. అధికారుల తీరు మార్చుకోక పోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఇక నైనా అధికారులు తమ తీరు మార్చుకోవాలని సూచించారు. సింగరేణి అధికారుల తీరుపై సంస్థ సిఎన్ఎండీ బలరాంను కలిసి వివరిస్తానని తెలిపారు. ప్రభుత్వ శాఖలలో ప్రజా సమాచార అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ కు తెలియజేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసాలు మురళీ మోహన్, గండ్ర జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.