18-03-2025 12:00:00 AM
తెలంగాణ కొంగుబంగారం వంటి సింగరేణిని ప్రైవేటీకరించే ఎలాంటి కార్యాన్నయినా ప్రజలు కలిసికట్టుగా అడ్డుకుంటారు. ఈ మేరకు మేధావులు, ప్రజాసంఘాలు ఏకం కావాల్సి ఉంది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉమ్మడిగా ఇందుకు కుట్ర పన్నుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంతో తెలియడం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిలూదిన ఈ కంపెనీని కాపాడుకోవడం మనందరి బాధ్యత.
సహర్ష, ఓల్డ్ ఆల్వాల్