calender_icon.png 2 February, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిట్లపురాణం ఆపి పాలనపై దృష్టిపెట్టాలి

02-02-2025 02:14:29 AM

* బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

* వికారాబాద్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ 

వికారాబాద్, ఫిబ్రవరి 1(విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి తిట్లపురాణం ఆపి పాలన  దృష్టి సారించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రె  కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండలం దాస్యనాయక్ తండాల్లో నిర్వహించిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి కేవలం మా  మాత్రమే చెప్పి కాలం వెల్లదీస్తున్నాడని విమర్శించారు. అంతకుముందు రోజు సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కేసీఆర్ కట్టె లేకుండా నిలబడుతాడు గానీ.. ముందు నీవు కమీషన్లు లేకుండా ప్రభుత్వాన్ని నడపాలంటూ కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ కొడితే ఎలా ఉంటదో రేవంత్ పాత గురువు రాహుల్ అడగాలని ఎద్దేవా చేశారు. దమ్ముంటే లగచర్లకు రావాలని సవాల్ విసిరారు. దళిత బంద్ పథకానికి తిలోదకాలు వదిలి ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షలు ఇస్తానన్న సీఎం ఇప్పటి వరకు ఒక్క కుటుంబానికి కూడా సాయం చేయలేదని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కేసీఆర్‌కు అంబేద్కర్ స్ఫూర్తి అని పేర్కొన్నారు. మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.