- ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం
- 15 నెలల యుద్ధానికి ముగింపు
- బయటపడనున్న బందీలు
- క్రెడిట్ కోసం ట్రంప్, బైడెన్ పాకులాట
దోహా, జనవరి 16: దాదాపు 15 నెలల నుంచి కొనసాగుతున్న ఇజ్రాయెల్ యుద్ధానికి తాత్కాలికంగా తెరపడనుంది. ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ ఒప్పందంతో గాజాలో తాత్కాలికంగా తూటాల శబ్దం అంతం కానుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ దళాలను శత్రు దేశం నుంచి పూర్తిగా వెనక్కి పిలిపించనున్నారు.
అంతే కాకుండా ఇన్ని రోజులుగా ఇజ్రాయెల్ ఆర్మీ బందీలుగా పట్టుకున్న పాలస్తీనియన్ పౌరుల్ని అలాగే హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ దేశస్తుల్నీ, రెండు దేశాల అదుపులో ఉన్న వేరే దేశాల పౌరుల్ని వదిలేసేందుకు రెండు దేశాలు అంగీకారం తెలిపాయి.
నెలల నరమేధానికి మోక్షం..
ఇజ్రాయెల్ మధ్య అనేక నెలలుగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధం వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గురించి బైడెన్ మాట్లాడుతూ.. ‘ఎన్నో నెలలు అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాల చర్చల ఫలితంగా ఇజ్రాయెల్ యుద్ధానికి తాత్కాలిక విరా మం లభించింది.
కాల్పుల విరమణ, బందీల విడుదలకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించా యి. ఈ ఒప్పందం గాజాలో యుద్ధానికి తెరదించడమే కాకుండా, ఎవరైతే మానవతా సా యం కోసం ఎదురుచూస్తున్నారో వారికి సహా యం కూడా అందనుంది. బందీలు 15 నెలల విరామం తర్వాత వారి కుటుంబంతో కలిసేందుకు అవకాశం కల్పిస్తుంది’ అని తెలిపారు.
ఆరు వారాలు మాత్రమే..
కాల్పుల విరమణ ఒప్పందం ఆరు వారాల పాటు సాగనుంది. ఈ ఒప్పందం జనవరి 19 నుంచి నుంచి అమల్లోకి రానుంది. ఆనాటి నుం చి గాజాలో ఉన్న ఇజ్రాయెల్ దళాలు తిరిగి వెన క్కి వెళ్లనున్నాయి. బందీలను ఇరు దేశాలు విడుదల చేయనున్నాయి.
‘ఎవరికైతే వైద్య సహా యం అవసరమో అటువంటి బందీలను తొం దరగా విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ ఒప్పుకుంది. అంతే కాకుండా రఫా బార్డర్‌ను మొదటి దశ మొదలైన ఏడు రోజుల తర్వాత తెరిచేందుకు అంగీకరించింది’ అని బైడెన్ తెలిపారు.
మొదటి దశ: ఇజ్రాయెల్ బలగాలు గాజాలో జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్తాయి. బందీల విడుదల.
రెండవ దశ: యుద్ధం శాశ్వతంగా ముగిచేందుకు ఇరు వర్గాలు ప్రయత్నిస్తాయి. ఇంకా మిగిలిన బందీలకు కూడా విముక్తి లభిస్తుంది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వతం అవుతుంది.
మూడో దశ: యుద్ధం వల్ల నష్టపోయిన గాజాలో పునఃనిర్మాణానికి ప్రణాళిక.
అమెరికాలో మొదలైన యుద్ధం
ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి తాత్కాలికంగా విరామం లభించగానే అమెరికా లో మాటల యుద్ధం మొదలయింది. ఇజ్రా యెల్ మధ్య జరిగిన శాంతి ఒప్పందంలో కీలక పాత్ర నాదంటే.. నాదని బైడెన్, ట్రంప్ వాదించుకుంటున్నారు. ట్రంప్ గెలిచిన తర్వాత హమాస్‌ను హెచ్చరిస్తూ పలు వ్యాఖ్య లు చేసిన సంగతి తెలిసిందే. తన హెచ్చరికల ఫ లితంగానే ఈ రెండు దేశాలు శాంతి ఒప్పందానికి అంగీకరించాయని ట్రంప్ వాదిస్తున్నారు. ఒప్పందం కుదరడంలో ట్రంప్ పాత్ర లేదని బైడెన్ అంటున్నారు. నెతన్యాహు ట్రంప్, బైడెన్ లకు ధన్యవాదాలు తెలిపారు.