calender_icon.png 27 April, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్రెగుట్టలో కాల్పులను ఆపండి

27-04-2025 12:32:05 AM

  1. మావోయిస్టులతో చర్చలు జరపండి
  2. ప్రభుత్వాలను కోరిన ప్రొఫెసర్ హరగోపాల్

హనుమకొండ, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో కాల్పు లను కేంద్రం ప్రభుత్వం ఆపాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర నేత ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. పౌర హక్కుల సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన సమావేశం లో వారు మాట్లాడారు.

మధ్య భారతంలో ఆదివాసుల హననాన్ని ఆపాలని, ప్రజాస్వా మ్య, రాజ్యాంగం అమలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని కోరారు. మావోయిస్టు-లు, కేంద్రం మధ్య జరుగుతున్న పోరా టంలో ఆదివాసీలు బలవుతున్నారని ఆవేద న వ్యక్తం చేశారు. ఆదివాసి ప్రజలు భయానక వాతావరణంలో ఉన్నారని వాపోయా రు. మావోయిస్టు పార్టీ లేఖలు రాసినప్పటికీ కర్రెగుట్టను వేలాది మందితో ముట్టడించ డం సరికాదన్నారు.

యుద్ధం అపాలని, సమాజ కోరిక మేరకు కేంద్రం ముందుకురావాలన్నారు. మధ్యభారతంలో అపారమై న విలువగల ఖనిజవ నరులను దేశ, విదేశీ వాణిజ్య, సామ్రాజ్యవాదులు కార్పొరేటర్లతో ఒప్పందాలు (ఎంవోయూ)చేసుకున్నారని ఆరోపించారు. అందులోభాగంగా ఆదివాసులకు అండగా, రక్షణగా ఉన్న మావోయి స్టులను అణచివేసేందుకు కేంద్రం పూనుకు న్నదని మండిపడ్డారు. ఈ ఏకపక్ష హననాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు.