calender_icon.png 5 April, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాడులు ఆపండి

05-04-2025 02:26:31 AM

  1. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు యూనస్‌కు మోదీ సూచన
  2. బిమ్‌స్టెక్ సదస్సు సందర్భంగా సమావేశం
  3. యూనస్-మోదీ మధ్య ఇదే తొలిభేటీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: బిమ్‌స్టెక్ సదస్సు సందర్భంగా బ్యాంకాక్‌లో భారత ప్రధా ని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. మహ్మద్ యూనస్ బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ మధ్య ఇదే తొలి భేటీ కావడం గమనార్హం.  ఈ భేటీలో బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులపై మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యూనస్‌కు పలు సూచనలు చేశారు. 

అనవసర వ్యాఖ్యలు వద్దు

భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ ఇద్దరు నేతల సమావేశం సందర్భంగా అక్కడే ఉన్నారు. వీరిద్దరి భేటీ వివరాలను భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్త్రి మీడియాకు వెల్లడించారు. ‘ప్రజాస్వా మ్య బంగ్లాకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు తెలుపుతుందని మోదీ పేర్కొన్నారు.

ఇప్పటి వరకు ఇదరు దేశాలు పరస్పర భాగస్వామ్యంతో అభివృద్ధి చెందిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. అదే సమయంలో సరిహద్దులో అక్రమ వలసలను నియంత్రిం చాలని కోరారు. ఇరుదేశాల నేతలు స్నేహపూర్వక వాతావరణాన్ని చెడగొట్టేలా సం భాషించకూడదని యూనస్‌కు సూచించా రు. సరిహద్దు భద్రత కోసం, రాత్రి వేళల్లో చొరబాట్లను అడ్డుకోవాలి’ అని అన్నారు.

బంగ్లా హిందువులపై ఆందోళన

ఇదే సమయంలో బంగ్లాదేశ్‌లో మైనార్టీలైన హిందువులపై జరుగుతున్న దాడుల గు రించి మోదీ యూనస్ దృష్టికి తీసుకెళ్లారని మిస్త్రి తెలిపారు. 2015లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా యూనస్ బంగారు పతకాన్ని అందుకున్నారు. అప్పుడు యూనస్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించేవారు. ఇందుకు సంబంధించిన ఫొటోను యూనస్ మోదీకి అందజేశారు.

మొన్నీ మధ్యే యూనస్ ఈశాన్య రాష్ట్రాల గురించి పలు వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు. ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర తీరం లేదని, వారు సముద్రానికి చేరుకునే అవకాశమే లేదన్నారు. చైనా పర్యటనలో భాగంగా యూనస్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

షేక్ హసీనాను బంగ్లాకు అప్పగిస్తారా?

మోదీధి భేటీ సందర్భంగా బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత గురించి ప్రస్తావన వచ్చిందా అని భారత విదేశాంగశాఖకు ప్రశ్న ఎదురైంది. దీనిపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి స్పందించారు. ‘షేక్ హసీనా విషయమై భారత్‌కు బంగ్లాదేశ్ అధికారిక అభ్యర్థన చేసింది. ఈ అంశంపై ఇప్పుడు ఎక్కువగా మాట్లాడడం సరికాదు. బంగ్లాదేశ్‌లో మైనార్టీల భద్రతపై ఆందోళనను ప్రధాని మోదీ యూనస్ దృష్టికి తీసుకెళ్లారు.’ అని వెల్లడించారు. షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు.

శ్రీలంకకు చేరుకున్న మోదీ

థాయిలాండ్ పర్యటన ముగించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంకకు చేరుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు అసుర కుమార దిసనాయకేతో మోదీ ఈ రోజు భేటీ కానున్నారు. 

బంగ్లాతో నిర్మాణాత్మక సంబంధాలు: ఎక్స్‌లో మోదీ.. 

వీరి భేటీకి సంబంధించిన వివరాలను భారత ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదాలు యూనస్‌తో సమావేశం జరిగింది. బంగ్లాలో హిందువుల భద్రత గురించిన అంశాన్ని లేవనెత్తా. బంగ్లాదేశ్‌తో నిర్మాణాత్మక, ప్రజాస్వామ్యయుత సంబంధాలకు భారత్ కట్టుబడి ఉంది’ అని పోస్ట్ చేశారు.