calender_icon.png 30 April, 2025 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీవ్రవాదాన్ని అరికట్టండి

30-04-2025 12:30:43 AM

కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్ 29: పాకిస్తాన్ తీవ్రవాదాన్ని అరికట్టాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ర్ట అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. మంగళవారం  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఈ నెల 22న జమ్ము కాశ్మీర్ రాష్ర్టం అనంతనాగ్ జిల్లా పహెల్గాం ప్రాంతంలోని బైసరన్ లోయ దగ్గర తీవ్రవాదులు జరిపిన కాల్పులను ఆయన తీవ్రంగా ఖండించారు.  ఇది పాకిస్తాన్, ఐ ఎస్ ఐ కు సంబంధించిన చర్యగా కేంద్ర ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తున్నది అన్నారు.

గతంలో కూడా దేశవ్యాప్తంగా పాకిస్తాన్ ఐ.ఎస్.ఐ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలు ఈ దేశంలో జరిగాయని, బొంబాయి నగరంలో కసబ్ ఆధ్వర్యంలో జరిగిన నరమేధం, అంతకుముందు ముంబై బ్లాస్టులు, హైదరాబాద్ నగరంలో జరిగిన గోకుల్ చాట్, లుంబిని పార్క్ బాంబు బ్లాస్టులు ఇలా ఎన్నో సంఘటనలు గతంలో జరిగినప్పుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ  అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను తప్పుపట్టారని అన్నారు.

మరి ఇప్పుడు మోడీ పీఎం అయిన తర్వాత ఉరీ ఆర్మీ క్యాంప్ మీద జరిగిన సంఘటన, పుల్వామా లో సైనికుల మీద జరిగిన దాడి, ఇప్పుడు మామూ లు యాత్రికులైన పౌరుల మీద జరిగిన దాడి ని శాశ్వతంగా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.  ఈ సమావేశంలో కొంపెల్లి రవీందర్, శ్రీరాముల కిషన్ , బైరం రాజేందర్, గాజం నరేందర్, నాగరాజు, అమృతరావులు పాల్గొన్నారు