calender_icon.png 25 October, 2024 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాచరికపు పోకడలకు స్వస్తి!

28-08-2024 12:50:27 AM

ఏపీలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మార్పులు

విజయవాడ, ఆగస్టు 27 (విజయక్రాంతి): కోర్టుల్లో జడ్జిల తరహా సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి చెల్లు చీటి పలికేలా రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. ఏపీలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బ్రిటీష్ కాల పు రాచరికపు పోకడలకు స్వస్తి పలకను న్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపు రేఖ లు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ, స్టాంపులు, రిజిస్టషన్ల శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నట్టుగానే సబ్ రిజిస్ట్రార్ల సీటింగ్ ఉండేలా చర్యలు ప్రారం భించారు. దీంతో సబ్ రిజిస్ట్రార్లు కూడా  సామాన్య అధికారులే అన్న భావన కలిగేలా రెవెన్యూ శాఖలో మార్పులకు బీజం పడిం ది. ప్రభుత్వ ఆమోదం రాగానే స్టాంపులు, రిజిస్టషన్ల శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా  సర్క్యులర్ జారీ చేయనున్నారు.