- రైతులపై ఎలాంటి కేసులు పెట్టలేదు
- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దయాకర్
హైదరాబాద్, నవంబర్ 15 (విజయ క్రాంతి) : కేటీఆర్ పొలిటికల్ డ్రామాలు ఆపాలంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శించారు. దాడులు చేయించింది మీరే అని అందరికీ తెలిశాక తమ పరువు పోకుండా ఉండటానికే రైతుల పేరున పరామర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
శుక్రవారం ఆయనఎక్స్ వేదికగా మాట్లాడుతూ.. రౌడీ మూకలు, దాడులకు ఉసిగొల్పిన వారి మీదనే కేసులు పెట్టినట్టు స్పష్టం చేశారు. అధికారుల మీద దాడులు చేయడంపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతోందని.. మీరు చేసిన ఈ పనికి తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందని కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.