12-03-2025 12:00:00 AM
స్పీకర్‌కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జీతభత్యాలు నిలిపి వేయాలంటూ మంగ ళవారం కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష హోదాలో ఒక్కసారి కూడా అసెంబ్లీకి రానప్పటికీ కేసీఆర్ జీతభత్యాలు అందు కుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రజల అభ్యున్నతి కోసం ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చే యాల్సిన కేసీఆర్ దానిని పట్టించుకోకుండా తన బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నారని తెలిపారు. సభకు రాకుండా తనకు ఓట్లు వేసిన తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నార న్నారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించే వరకు జీతభత్యాల విషయం లో పునరాలోచన చేయాలన్నారు. దర్పెల్లి రాజశేఖర్‌రెడ్డి, అల్లం భాస్కర్, జగన్‌లాల్ తదితరులున్నారు.