calender_icon.png 26 October, 2024 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టవిరుద్ధ సోదాలు ఆపండి

18-09-2024 12:09:57 AM

  1. ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని పిల్ 
  2. నేడు హైకోర్టులో విచారణ

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): మురికివాడల్లో వివిధ రకాల పేర్లతో పోలీసులు చట్టవిరుద్ధంగా సోదాలు చేస్తున్నారని, వాటిని నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైకోర్టులో పిల్ దా ఖలైంది. మిషన్ ఛబుత్రా, ఆపరేషన్ రోమి యో వంటి పేర్లతో సోదాలు నిర్వహిస్తుండటం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ హైదరాబాద్ బషరత్‌నగర్‌కు చెం దిన సామాజిక కార్యకర్త ఎస్‌క్యూమసూద్ పిల్ దాఖలు వేశారు. చిన్న, ఫుట్‌పాత్ వ్యాపారులను రాత్రి 10.30 నుంచి 11 గంటల్లోపే మూసివేయిస్తున్నారని చెప్పారు.

ఇలా చేయడం 2015లో జారీ చేసిన జీవో 15కు విరుద్ధమని పేర్కొన్నారు. పేదలు నివసించే కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే సోదాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గత ఏడాది మే 31న 200 మంది పోలీసులు తన నివాసంలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు సోదాలతో వేధించారని చెప్పారు. దీంతో తాము తప్పుచేసినట్టు ఇరుగుపొరుగు భావిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసు ల చర్య రాజ్యాంగంలోని అధికరణ 19, 21లకు విరుద్ధమని అన్నారు. 

ప్రతివాదులుగా హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌ను చేర్చారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేయనుంది.శించినా, అమలు కావడంలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఉత్తర్వుల అమలు నిమిత్తం కొంత గడువు ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తూ అమలు చేయకపోతే వైద్యఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్లు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు.