calender_icon.png 19 April, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్ట వ్యతిరేక పనులను ఆపండి

08-04-2025 12:47:35 AM

యాచారం, ఏప్రిల్ 7 : ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటి నాల్గు గ్రామాల రైతులు రైతు కూలీలు సమావేశము మేడిపల్లిలో నిర్వహించారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.  హైకోర్టు ఆర్డర్ ధిక్కరించి ఆర్డిఓ, ఎంఆర్‌ఓ, పోలీసు యంత్రాంగంతో భూముల చుట్టు ఫెన్సింగ్ పనులు చేయిస్తున్నారని ఇట్టి పనులు చట్ట వ్యతిరేకమని జిల్లా కలెక్టర్, ఆర్డిఓ, ఎమ్మార్వో, మహేశ్వరం డిసిపి, ఇబ్రహీంపట్నం ఏసిపి, గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ సీఐకి హైకోర్టు ఆర్డర్ కాపీలు ఇవ్వడంతో పాటు అభ్యంతరంతో కూడిన వినతి పత్రాలు కూడా ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

అనంతరం నాయకులు రైతులు మాట్లాడారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో హైకోర్టు ఆర్డర్ కాపీలు పొందుపరిస్తే పనులు ఆపు చేసినారని అవే పనుల్ని ఇప్పుడు ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రభుత్వాలు మారినంత మాత్రాన చట్టాలు మారుతాయా అని ప్రశ్నించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాడు రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని అన్నారు. రైతుల భూములు రైతులకు ఇస్తామని నాడు కాంగ్రెస్ నాయకులు  ఘంటాపరంగా చెప్పారని పేర్కొన్నారు.

రైతుల పేర్లు ఆన్లైన్లో నమోదు చేసి నిషేధిత జాబితా నుండి తొలగిస్తామని హామీ ఇచ్చారన్నారు. మూడు పంటలు పండే భూముల్ని సేకరించడం అన్యాయమన్నారని ఇప్పుడేమో రైతుల్ని పోలీసు యంత్రాంగంతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. చట్ట వ్యతిరేక పనుల్ని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు రైతులు రైతు కూలీలు తీవ్రంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు.

గత ఫిబ్రవరి 11న ఇబ్రహీంపట్నం ఏసీపి కార్యాలయం వద్ద మహేశ్వరం జోన్ డిసిపి సునీత రెడ్డి రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రైతులు ఏలాంటి ఆందోళన చెందవద్దని  భూములను ఆన్లైన్ లోను ఎక్కించి నిషేధిత జాబితాలో నుంచి తొలగించి పై అధికారులతో మాట్లాడు చేయిస్తామని మాట ఇచ్చారని కానీ నేటికీ వరకు రైతుల సమస్యలు పరిష్కరించక పోదాం డిసిపి ఆధ్వర్యంలోనే తమ గ్రామంలో భూముల చెట్టు ఫెన్సింగ్ పనులు చేయిస్తున్నారని రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు.

మీరు మా సమస్యలు పరిష్కరించే వరకు మా గ్రామంలోనికి రావద్దని అన్నారు.నాడు ఫార్మాసిటీ అని నేడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. పేద రైతుల భూములు లాక్కొని ఏమి సాధించాలనుకుంటున్నారని ఇదేనా ప్రజా పాలన అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు కానమోని గణేష్, సావ నిరంజన్ పర్యావరణవేత్త కవుల సరస్వతి, ముత్యాలమ్మ మహిపాల్ రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.