05-04-2025 01:43:44 AM
‘ఎక్స్’ లో హరీశ్‌రావు
హైదరాబాద్, ఏప్రిల్ 4, (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్‌పై వేధింపులు మానుకోవాలని ఎమ్మెల్యే హరీశ్ రావు హితవు పలికారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై రేవంత్ సర్కార్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు.
నల్లగొండ జిల్లా మర్తినేనిగూడెం మాజీ సర్పంచ్ బండమీది రామును అక్రమంగా పోలీస్ స్టేషన్‌లో నిర్భందించారని, ఇలా ఎంతమందిపై కేసులు పెడతారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే అరెస్టులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని నిలదీశారు. అక్రమ కేసులు ఉపసంహారించుకోవాలని హరీశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.