నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసినా అక్రమార్కులు వివిధ మార్గాల్లో గుట్కా అమ్మకాలు, రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజల అమాయకత్వాన్ని, బలహీనతలను ఆసరాగా చేసుకుని వ్యాపారులు అక్రమ అమ్మకాలు సాగిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతం నుండి వివిధ ప్రాంతాలకు నిషేధిత పొగాకు ఉత్పత్తులను రవాణా చేస్తున్నట్లు తెలుస్తున్నది.పట్టణ ప్రాంతాలలో చిన్న దుకాణాలలో అమ్మకాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిషేధిత పొగాకు ఉత్పత్తులను అమ్ముతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.
వావిలాల రాజశేఖర శర్మ, నాగర్నాగర్ కర్నూల్ జిల్లా