calender_icon.png 22 April, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంకర క్రషర్ నిర్మాణ పనులను ఆపండి

22-04-2025 01:30:27 AM

కలెక్టర్‌ను కోరిన మాదారం గ్రామస్తులు

పటాన్ చెరు, ఏప్రిల్ 21: అనుమతులు లేకుండా కొనసాగిస్తున్న  కంకర క్రషర్  నిర్మాణ పనులను వెంటనే నిలిపివే యాలని మాదారం గ్రామస్తులు కలెక్టర్ ను కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మాదారం గ్రామంలోని  సర్వే నంబర్ 210 లో ఎలాంటి అనుమతులు లేకుండా గత వారం రోజులుగా కంకర క్రషర్ ఏర్పాటు  పనులు జోరుగుతున్నాయని తెలిపారు.

ఈ విషయమై అక్కడి నిర్వాహకులను అడిగితే నిర్లక్ష్యంగా సమా ధా నం ఇస్తున్నారని వివరించారు. ఈ ప్రాంతంలో కంకర క్రషర్ ఏర్పాటు చేయడం వల్ల సమీపంలోని చెరువులు  కలుషితం అవుతుందని తెలిపారు. గ్రామానికి అతి సమీపంలో ఈ క్రషర్ ఏర్పాటు చేస్తుండడం వల్ల దుమ్ము, భారీ బ్లాస్టింగ్ లతో ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పారు.

కలెక్టర్ తో పాటు, ఆర్డీఓ, మైనింగ్, పోలీసు శాఖల అధికారులకు తమ ఫిర్యాదు చేశామని తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి క్రషర్ నిర్మాణ పనులను ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రాజు గౌడ్, సీతారాం, ఎల్లయ్య, రమణ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

విచ్చలవిడి బ్లాస్టింగులతో ఇబ్బందులు 

మాదారం శివారులోని కంకర క్రషర్ లు విచ్చలవిడిగా బ్లాస్టింగ్స్ నిర్వహిస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ లు నిర్వహిస్తున్న కంకర క్రషర్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. విజయ్ గౌడ్ గ్రామస్తులుపాల్గొన్నారు.