04-04-2025 01:27:12 AM
ఐఎఫ్టియూ ఆధ్వర్యంలో రాస్తారోకో
మహబూబాబాద్, ఏప్రిల్. 3: విజయక్రాంతి: కేసముద్రం మార్కెట్ యార్డ్ బయట ట్రేడింగ్ కంపెనీలు, మిల్లుల వద్ద వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడం వల్ల దడువాయి, హమాలి, కూలీ , బండి హమాలి కార్మికుల పని కోల్పోతున్న నేపథ్యంలో మార్కెట్ బయట వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయకుండా నిలువరించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కేసముద్రం మార్కెట్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు.
కార్మికుల హక్కుల రక్షణకై హమాలీ యూనియన్ పట్టణ అధ్యక్షులు మిట్ట గడుపుల వెంకన్న అధ్యక్షతన చేపట్టిన రాస్తారోకోను ఉద్దేశిస్తూ ఐఎఫ్టియు అనుబంధ తెలంగాణ హమాలీ మిల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శివ్వారపు శ్రీధర్ మాట్లాడుతూ కేసముద్రం మార్కెట్ యార్డుకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉందని, దేశంలోనే ప్రధానమంత్రి ఎక్స్లెంట్ అవార్డు పొందిన మార్కెట్ ను రక్షించుకుని కార్మికుల పని కోల్పోకుండా కాపాడుకునే బాధ్యత మన అందరి పైన ఉందన్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు మార్కెట్లోనే జరిగే విధంగా చర్యలు తీసుకునే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని మార్కెట్ ను కాపాడాలని డిమాండ్ చేశారు. వేబ్రిడ్జ్‌ల వద్ద కాంటాలు జరగడం మూలాన దడ్వాయికి, హమాలి, కూలీలు, బండ్ల కార్మికుల ఉపాధికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంన్న దున కార్మికుల ఐక్యమై హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఇదే పద్ధతి కొనసాగి నట్లయితే కార్మికుల తరఫున నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతు కూలి సంఘం నాయకులు మండల అధ్యక్ష కార్యదర్శులు బట్టు నాగేశ్వరరావు, కొట్టం అంజ య్య, ఐఎఫ్‌టియు నాయకులు బట్ట మేకల రాజు,బండి రాజు,దడువాయి యూనియన్ నాయకులు ఆంగోత్ మంగిలాలు,సింగిరెడ్డి కృష్ణ, నాగేంద్రబాబు, బేతి రాజు, మోటపోతుల శ్రీను, హమాలీ యూనియన్ నాయ కులు బండి రాజు, ఎస్ కే జిలాని, అల్లం వెంకన్న, భూక్య బిచ్చ,ప్రవీణ్, సంజీవ, కాసుసూరయ్య, యాకయ్య, కూలి యూనియన్ నాయకులు సకినాల ఐలయ్య, రాధ క్క, అంతు తార, సాంబ లక్ష్మి, నీల,ఏమి, జాటోత్ మంజుల, పిన్నోజు విజయ, బాదావత్ కవిత, బోడ తార, బులీ, బీహార్ కార్మికులు చందన్ కుమార్ యాదవ్, సోహాన్ యాదవ్, జోగేంద్ర యాదవ్, కపిల్ యాదవ్, రాజేష్ యాదవ్, నందన్ కుమార్ యాదవ్, పప్పు యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, ఉప్పలయ్య, పయ్యావుల అనిల్, సురేష్, స్వామి, బానోత్ నాగు, దండు ఎల్లమ్మ, జయమ్మ, రజిత, అందే నీల, సుమతి, సోనా, సరస్వతి తదితరులు పాల్గొన్నారు