- కాదు కాదు.. ఆయనే కారుతో ఇద్దరిని ఢీకొట్టారన్న బీజేపీ
- బీజేపీవి చౌకబారు రాజకీయాలని ఆప్ మండిపాటు
- దాడి జరగలేదని ఢిల్లీ పోలీసుల ఖండన
న్యూఢిల్లీ, జనవరి 18: న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేస్తు న్న ఆప్ అధినేత కేజ్రీవాల్ కాన్వాయ్‌పై దాడి జరిగిందని ఆప్ శనివారం ఆరోపించింది. ప్రచారం సందర్భంగా కేజ్రీవాల్ కారుపై రాయి విసిరి అంతరాయం కలిగించేందుకు బీజేపీ ప్రయత్నించిందని మండిపడింది. దీ న్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రచార సమయంలో కేజ్రీవాల్ కారే ఇద్దరు వ్యక్తులపైకి దూసుకెళ్లిందని బీజేపీ ఎంపీ పర్వేశ్ వ ర్మ ఆరోపించారు.
ఇరు పార్టీలు పరస్పరం మాటల దాడి చేసుకుంటుండగా కేజ్రీవాల్ వాహనంపై రాయిపడినట్టు కనిపిస్తోందని పేర్కొంటూ ఘటనను చూపే ఓ వీడియోను ఆమ్‌ఆద్మీ పార్టీ ఎక్స్‌లో విడుదల చేసింది. “బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ గూండాలు కేజ్రీవాల్ ప్రచా రం చేస్తుండగా రాళ్లతో దాడి చేసి, ప్రచారం చేయనివ్వకుండా చేసేందుకు ప్రయత్నిం చారు. కేజ్రీవాల్ ఇలాంటి దు శ్చర్యలకు భ యపడరు..ఢిల్లీ ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెబుతారు..”అని అందులో పే ర్కొంది.
బీజేపీ చౌక రాజకీయాలను ప్రజలు చూస్తున్నారని, తగిన సమాధానం చెబుతారని మనీష్ సిసోడియా అన్నారు. ప్రచారం సందర్భంగా కేజ్రీవాల్ కాన్వాయ్ ఇద్దరు వ్యక్తులపైకి దూసుకెళ్లిందని ఆరోపిస్తూ ఎంపీ పర్వేశ్ వర్మ వీడియోను షేర్ చేశారు.
“ప్రజలు ప్రశ్నిస్తుండగానే కేజ్రీవాల్ తన కారుతో ఇద్దరు యువకులను ఢీకొట్టాడు. ఇద్దరిని లేడీ హార్డింజ్ ఆ స్పత్రికి తీసుకెళ్లారు. ఓటమి గురించి ఆలోచిస్తూ ప్రజల ప్రాణాల విలువ మరిచిపో యాడు. బాధితులను చూసేందు కు నేను ఆస్పత్రికి వెళ్తున్నా..” అంటూ పర్వేశ్ వర్మ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఢిల్లీ పోలీస్ వర్గాలు స్పందిస్తూ.. కేజ్రీవాల్‌పై ఎలాంటి దాడి జరగలేదని ఖండించాయి.
అద్దె ఇళ్లల్లో నివసిస్తున్న వారికి ఉచిత విద్యుత్, నీరు
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే అద్దె ఇళ్లల్లో నివసిస్తున్న వారికి ఉచిత విద్యుత్, నీరు అందించే పథకాన్ని ప్రవేశపెడతామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రకటించారు. శనివారం మాట్లాడుతూ.. ఢిల్లీవాసులకు ఉచిత విద్యుత్, నీరు అందించామని, అయితే అద్దె ఇళ్లల్లో నివసించేవారికి ఈ ప్రయోజనాలు అందలేదన్నారు.
వీరంతా పూర్వంచల్‌కు చెందినవారని, వారిలో చాలా మంది పేదలని, వారికి పథకాలు వర్తించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే వారికి ప్రయోజనం కలిగేలా ఉచిత విద్యుత్, నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.