calender_icon.png 31 January, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చోరీకి గురైన 1190 సెల్ ఫోన్లు రికవరీ

31-01-2025 03:22:27 PM

ఫోన్ల విలువ రూ.2 కోట్ల 55 లక్షలు

చోరీకి గురైన ఫోన్లను బాధితులకు అందజేసిన క్రైమ్స్ డీసీపీ నర్సింహ

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): సైబరాబాద్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్స్ ని సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు శుక్రవారం తిరిగి బాధితులకు అందజేశారు. మొత్తం 1190 సెల్ ఫోన్లను రికవరీ చేశారు. గత 11 నెలల కాలంలో మొత్తం 5500 వందల ఫోన్లు రికవరీ చేసినట్లు క్రైమ్స్ డీసీపీ నరసింహ్మ తెలిపారు. చోరీ లేదా మిస్ అయిన సెల్ ఫోన్ లోని సిఈఐర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసినట్లు వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్ల 55 లక్షల విలువ ఉంటుందన్నారు.

అనంతరం సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ నర్సింహ రూ.2 కోట్ల 55 లక్షల విలువైన ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డిజిటల్ అరెస్ట్, ఈజీ మనీ, షేర్స్ లలో పెట్టుబడుల పేరుతో ఆశ చూపించి సైబర్ నేరగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటి మోసాల గుర్తించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల కాలంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందన్నారు. ఎటిఎం, బ్యాంకు ఖాతాలు, సెంటిమెంట్స్, పర్సనల్ సమాచారం, ఎన్నో సేవలు మొబైల్ ద్వారా వినియోగిస్తామన్నారు. సెల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలన్నారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు అమ్మినా, కొన్నా చట్టపరంగా నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ పోలీస్ సిబ్బంది, బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.